అర్థశాస్రం-విషయవస్తువు-నిర్వచనాలు-ప్రాథమిక భావనలు

50 %
50 %
Information about అర్థశాస్రం-విషయవస్తువు-నిర్వచనాలు-ప్రాథమిక భావనలు
Education

Published on April 6, 2014

Author: MEENAIAH

Source: authorstream.com

అర్థశాస్రం-పరిచయం-విషయవస్తువు-పరిధి-నిర్వచనాలు-ప్రాథమిక భావనలు: అర్థశాస్రం-పరిచయం-విషయవస్తువు-పరిధి-నిర్వచనాలు-ప్రాథమిక భావనలు అక్కెనపల్లి మీనయ్య క న్వీనర్ నల్లగొండ ఎకనామిక్స్ ఫోరం అర్థశాస్రం-పరిచయం-విషయ వస్తువు: అర్థశాస్రం - పరిచయం-విషయ వస్తువు Economics అనే పదం ఒకియో( Oiko ) నామస్ ( Nomos ) అనే రెండు గ్రీకు పదాల ద్వారా వచ్చింది. Oiko ( House) అనగా గృహం, Nomos (Management) అనగా నిర్వహణ అని అర్థం. అరిస్టాటిల్ అర్థశాస్త్రాన్ని గృహనిర్వహణ శాస్త్రంగా (Household Management) పేర్కొన్నాడు. 1776 లో ఆడమ్‌స్మిత్ వ్రాసిన దేశాల సంపద ( Wealth of Nations) అనే గ్రంధం అర్థశాస్త్రానికి ప్రత్యేక శాస్త్ర రూపమిచ్చింది. ఆడమ్‌స్మిత్‌ను అర్థశాస్త్ర పితామహునిగా పేర్కొంటారు. కోరికలు-యత్నాలు-తృప్తి అనేవి అర్థశాస్త్ర విషయ వస్తువు. అర్థశాస్రం-స్వభావం-పరిధి: అర్థశాస్రం-స్వభావం-పరిధి కోరికల దృష్ట్యా వనరులు పరిమితంగా వుండడం వల్ల ఎంపిక సమస్య ఉత్పన్నమవుతుంది. దీనినే ఆర్థిక సమస్య అంటారు. ప్రతి ఆర్థిక వ్యవస్థ మూడు ప్రదాన సమస్యలను ఎదుర్కొంటుంది. 1)ఏవస్తువులను ఉత్పత్తి చేయాలి. 2) ఏపద్దతిలో ఉత్పత్తి చేయాలి. 3)ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి. ఆర్థిక కార్యకలాపాలను శాస్త్రీయంగా అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. ఆర్థిక కార్యకలాపాలను 1. వినియోగం 2. ఉత్పత్తి. 3. వినిమయం. 4.పంపిణి గా వర్గీకరించవచ్చును. ఉత్పత్తికి దోహదపడే ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన వాటి ప్రతిఫలాలు భాటకం, వేతనం. వడ్డీ, లాభం దీని పరిధి లోనికి వస్తుంది. ప్రభుత్వ రాబడి, పన్నులు, వ్యయం, ద్రవ్యం, బాంకింగ్,ద్రవ్యోల్భణం, జాతీయాదాయం, ఉద్యోగిత, నిరుద్యోగిత, పేదరికం,ఎగుమతులు, దిగుమతులు, ఆర్థికాభివృద్ధి. జీవన ప్రమాణం దీని పరిధి లోనికి వస్తాయి. అర్థశాస్త్ర విషయ వస్తువు Subject matter of Economics: అర్థశాస్త్ర విషయ వస్తువు Subject matter of Economics ఆర్థిక ఏజెంట్లు-Economic Agents: ఆర్థిక ఏజెంట్లు -Economic Agents అర్థశాస్రం-నిర్వచనాలు: అర్థశాస్రం-నిర్వచనాలు ఏ శాస్త్రాన్ని అయినా అవగాహన చేసుకోవడానికి దాని నిర్వచనాలను పరిశీలించాల్సివుంటుంది. అర్థశాస్తాన్ని నిర్వచించడమంటే నానాటికి విస్తృతమవుతున్న దాని పరిధిని తగ్గించడమే అందువల్ల దీనికి నిర్వచనమే అవసరం లేదని గున్నార్ మిర్దాల్ అభిప్రాయపడినాడు. జాకబ్ వైనర్ (Jacob Viner ) ప్రకారం “Economics is what Economist do” ఆర్థికవేత్త ఏది చేస్తే అదే అర్థశాస్త్రం ఆడమ్‌స్మిత్-సంపద నిర్వచనం. ఆల్‌ఫ్రెడ్ మార్షల్-శ్రేయస్సునిర్వచనం. లైనల్ రాబిన్స్-కొరత నిర్వచనం. శామూల్‌సన్- వృద్ధి నిర్వచనం ఆడమ్‌స్మిత్-సంపద నిర్వచనం: ఆడమ్‌స్మిత్-సంపద నిర్వచనం 1776 లో ఆడమ్‌స్మిత్ (Adam Smith) (1723-1790-స్కాట్లాండ్) వ్రాసిన దేశాల సంపద ( Wealth of Nations) అనే గ్రంధం లో అర్థశాస్త్రానికి ఇచ్చిన నిర్వచనమే సంపద నిర్వచనం.ఇతనిని అర్థ శాస్త్ర పితామహునిగా పేర్కొంటారు. ఆర్థిక మానవున్ని ప్రామాణికంగా తీసుకొనడం అనగా స్వలాభం ప్రధాన ప్రేరణ. అర్థశాస్త్రం “సంపదను గూర్చిన శాస్త్రం” “Economics is the study of wealth”. ఆర్థిక కార్యకలాపాలలో ప్రభుత్వ జోక్యం వుండరాదు. అగోచర హస్తం (ధరల యంత్రాంగం) ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తుంది సంపద నిర్వచనం-విమర్శ: సంపద నిర్వచనం-విమర్శ ఆడమ్‌స్మిత్ ఇచ్చిన సంప్రదాయ నిర్వచనం ఆనాటి ఆర్థిక వేత్తలైన జె.బి. సే, జె.ఎస్.మిల్, వాకర్, నాసా సీనియర్, ప్రెస్ మొదలైన వారు సమర్థించినప్పటికి అనేక విమర్శలకు గురైంది. ఫ్రాన్స్ ఆర్థిక వేత్త వాల్రస్ తన గ్రంధమైన “ Elements of pure Economics” లో సంపద నిర్వచనం లోపభూయిష్టం, అశాస్త్రీయం, అసంపూర్ణం అని విమర్శించినాడు. కార్లైల్ దీనిని గాస్పెల్ ఆప్ మమ్మన్ ( Gospel of mammon) గా పేర్కొన్నాడు. కార్లైల్, రస్కిన్,డికెన్స్ దీనిని నిరాశాపూరిత శాస్త్రం ( Dismal Science) గా పేర్కొన్నారు. ఆల్‌ఫ్రెడ్ మార్షల్(Alfred Marshall)-శ్రేయస్సునిర్వచనం. (1842-1924) లండన్. ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఎకనామిక్స్-1890 నవ్యసంప్రదాయవాదులలో ముఖ్యుడు :  ఆల్‌ఫ్రెడ్ మార్షల్ (Alfred Marshall) -శ్రేయస్సునిర్వచనం. (1842-1924) లండన్. ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఎకనామిక్స్-1890 నవ్యసంప్రదాయవాదులలో ముఖ్యుడు “ అర్థశాస్త్రం ఒకవైపున సంపదను గూర్చిన చర్చ అనియు అంతకంటె ముఖ్యంగా మరొకవైపున మానవుని గురించిన పరిశీలనలో ఒక భాగం” మార్షల్. “ అర్థశాస్త్రం మానవుని దైనందిన జీవనాన్ని గురించి పరిశీలించే విజ్ఞాణం. మానవుని శ్రేయస్సుకు కారణభూతాలైన భౌతిక సాధనాల ఆర్జన వినియోగాలతో సంబంధం వున్న వ్యక్తిగత,సామాజిక కార్యాల అధ్యయనం” మార్షల్. శ్రేయస్సు నిర్వచనానికి మార్సల్ పునాది వేయగా ఎ.సి. పిగూ అభివృద్ధి పర్చినాడు. ఇటాలియన్ ఆర్థిక వేత్త పారిటో దీనిని నూతన శిఖరాలకు చేర్చినాడు. 1.మానవునికి ప్రథమ స్థానం-సంపదకు ద్వితీయ స్థానం 2. ఆర్థిక మనిషి (హేతుబద్ధత). 3. సంఘటిత సమాజంలోని వ్యక్తుల కార్యకలాపాలు. 4. భౌతిక సాధనాలు.5. నిర్ణయాత్మక శాస్త్రం విమర్శ- 1. అభౌతిక వస్తువులను విస్మరించడం. 2. మానసిక భావన. 3. కొన్ని భౌతిక వస్తు వస్తువులు హాని కలిగిస్తాయి.. 4. సంఘటిత సమాజం అధ్యయనం ఐతే ఇది మానవ శాస్త్రం. కొరత నిర్వచనం- లైనల్ రాబిన్స్ Lionel Robbins-1898-1984 -London Nature and Significance of Economic Science-1932: కొరత నిర్వచనం- లైనల్ రాబిన్స్ Lionel Robbins- 1898-1984 -London Nature and Significance of Economic Science-1932 “ అనంతమైన మానవ వాంఛలకు, బహుళ ప్రయోజనం గల పరిమిత సాధనాలకు మధ్యవుండే సంబంధం పట్ల మానవ ప్రవర్తనను అధ్యయనం చేయడమే అర్థశాస్త్రం” లైనల్ రాబిన్స్. ముఖ్యాంశాలు. 1. కోరికలు అనంతం. 2.సాధనాలు పరిమితం. 3.సాధనాలకు బహుళ ప్రయోజనాలు. ప్రాముఖ్యత- సార్వజనీనత-విశ్లేషణాత్మకం-శుద్ధ శాస్త్రం (లక్ష్యాల మధ్య తటస్థత) శామూల్‌సన్- వృద్ధి నిర్వచనం 1915-2009 Samuelson -USA 1970 నోబుల్ బహుమతి గ్రహీత. “Economics “ గ్రంధం: శామూల్‌సన్- వృద్ధి నిర్వచనం 1915-2009 Samuelson -USA 1970 నోబుల్ బహుమతి గ్రహీత. “Economics “ గ్రంధం వృధ్ధి నిర్వచనం చలన స్వభావం తో కూడుకున్నది. “ప్రజలు మరియు సమాజం ద్రవ్యంతోగాని ద్రవ్యం లేకుండాగాని వివిద ప్రయోజనాలున్న పరితమైన ఉత్పాదక వనరులను ఎంపికచేసుకొని, వాటిని ఉపయోగంచుకొనడం ద్వారా వస్తూత్పత్తిని చేపట్టి దానిని సమాజంలోని వివిద వర్గాల ప్రజల మధ్య వర్తమాన లేదా భవిష్యత్తు కాలాలలో ఏవిధంగా పంపిణీ చుకోవడం జరుగుతుందనే విషయ పరిశీలనే అర్థశాస్త్రం” ముఖ్యాంశాలు- వనరుల కొరత-చలన స్వభావం-ఆర్థిక వృధ్ది-విస్తృత పరిధి-ఎంపిక సమస్య సూక్ష్మ-స్థూల అర్థశాస్త్రాలు Micro-Macro Economics: సూక్ష్మ-స్థూల అర్థశాస్త్రాలు Micro-Macro Economics అర్థశాస్త్రంలో ప్రథమ నోబుల్ బహుమతి గ్రహీత (1969) రాగ్నార్ ఫ్రిష్ మొదటగా (1933) అర్థశాస్త్రంలో సూక్ష్మ, స్థూల అనే పదాలను ప్రవేశపెట్టినాడు. అర్థశాస్త్ర అధ్యయనాన్ని సంప్రదాయ పధ్ధతిలో ఉత్పత్తి, వినియోగం, వినిమయం, పంపిణి అనే నాలుగు భాగాలుగా చేయడం జరుగుతుంది. ఆధునిక పధ్ధతిలో అర్థశాస్త్ర అధ్యయనాన్ని సూక్ష్మ-స్థూల అర్థశాస్త్రాలుగా చేయడం జరుగుతుంది. సూక్ష్మ అర్థశాస్త్రం: సూక్ష్మ అర్థశాస్త్రం వైయక్తిక యూనిట్ల పరిశీలన. రికార్ఢో, జె.బి.సే, జె.ఎస్.మిల్, మార్షల్-ప్రాధాన్యత. ధరల సిధ్ధాంతం ( Price Theory). అదృష్య హస్తం. సంపూర్ణోద్యోగిత. ప్రభుత్వ జోక్యం వుండదు. స్థూల అర్థశాస్త్రం Macro Economics J.M.Keynes 1883-1946: స్థూల అర్థశాస్త్రం Macro Economics J.M.Keynes 1883-1946 యూనిట్ల సమూహాన్ని అనగా సమిష్టి యూనిట్ల పరిశీలన . జాతీయాదాయం, జాతీయోత్పత్తి, ఉద్యోగిత, సమిష్టి డిమాండు, సమిష్టి సప్లయ్, సాధారణ ధరల స్థాయి. . ఆర్థిక మాంధ్యం 1930 నేపథ్యలో జె. యం కీన్స్ వ్రాసిన The General Theory of Employment Interest and Money-1936 . స్థూల అర్థశాస్త్రానికి ప్రాముఖ్యతనిచ్చింది. దీనిని ఆదాయ ఉద్యోగితా సిధ్దాంతం అని గూడా అంటారు. నిశ్చల-చలన విశ్లేషణ. Static and Dynamic Analysis: నిశ్చల-చలన విశ్లేషణ. Static and Dynamic Analysis నిశ్చల-చలన అనే పదాలను సామాజిక శాస్త్రంలో మొదటగా అగస్టిన్ కొమ్టే ప్రవేశ పెట్టగా, అర్థశాస్త్రంలో జె.ఎస్.మిల్ ప్రవేశపెట్టినాడు. నిశ్చల-చలన అనే పదాలకు స్పష్టమైన తేడాను రాగ్నార్ ఫ్రిష్ తెలిపినాడు. నిశ్చల విశ్లేషణ: నిశ్చల విశ్లేషణ ఏ మార్పులు, కదలికలు లేని ఒకానొక విరామ స్థితిని నిశ్చల స్థితి అంటారు. కాలంతో సంబంధం లేని అర్థక విశ్లేషణ వుంటుంది. ఒకే కాలానికి చెందినవిగా పరిగణించి వాటి మధ్య సంబంధాన్నిపరిశీలించడం జరుగుతుంది. క్లార్క్ ప్రకారం దేశ జనాభా,మూలధన సప్లయ్, ఉత్పత్తి విధానాలు, వ్యాపార వ్యవస్థ, ప్రజల కోరికలు అనే ఐదు అంశాలలో ఎలాంటి మార్పులు లేని స్థితి. ఈ పధ్దతి కెమెరా తీసిన స్టిల్ ఫోటో లాంటిది. చలన విశ్లేషణ: చలన విశ్లేషణ కాలమూలకమైన పరిణామాలుండే ప్రభావాలను అధ్యయనం. కాలవిలంభనలు మార్పుల రేట్లు వివిద చలాంకాల గత భవిష్యత్ కాల తాలూకు విలువల పరిశీలన. కుజ్‌నెట్ ప్రకారం ఆర్థికపరమైన మార్పులను వివరిస్తుంది. ఈ పధ్దతి సినిమా ఫిల్మ్ లాంటిది నిగమన పధ్ధతి-Deductive Method: నిగమన పధ్ధతి- Deductive Method సంప్రదాయవాదులు నిగమన పధ్దతిని అనుసరించినారు. ఈ పధ్దతిలో ఒక సార్వత్రిక సత్యాన్ని కొన్ని ప్రమేయాల ఆధారంగా ప్రతిపాదించి తద్వారా ఏర్పడే ఫలితాలను విశ్లేషిస్తారు. వీటి ద్వారా వచ్చే ఫలితాలను తర్కపధ్ధతి ద్వారా చర్చించి సిధ్దాంతీకరించడం జరుగుతుంది. ఇందులో కార్యకారణ సంబంధాన్ని విశ్లేషించడం జరుగుతుంది. పరిశీలిస్తున్న అంశం తప్ప మిగతావన్నీ స్థిరంగా వున్నాయని భావిచండం జరుగుతుంది. (Ceteris Peribus). ఆడమ్‌స్మిత్, రికార్డో, నాసా సీనియర్, జె.ఎస్. మిల్, ఈపధ్దతిని అనుసరించినారు. ఉదా- డిమాండు సూత్రం. క్షీణోపాంత ప్రయోజన సూత్రం. నిగమన పధ్ధతి-సుగుణాలు-లోపాలు: నిగమన పధ్ధతి-సుగుణాలు-లోపాలు సుగుణాలు-1.భౌధ్దిక ప్రయోగం-క్లిష్టమైన విషయాలను సులువుగా అర్థం చేసుకొనవచ్చును.2. తర్కం,గణితం రెండూ వుపయోగించడయవలన స్పష్టత, నిర్దిష్టత, ఖచ్చితమైన నిర్ణయాలు.3 ఆలోచనాత్మక ప్రయోగం. లోపాలు-1.ప్రమేయలపై ఆధారపడటం. 2.కొన్నిఅంశాలు స్థిరంగా వుంటాయని భావించడం. 3. లర్నర్ ఆర్మ్ చైర్ విశ్లేషణగా పేర్కొన్నాడు.4. అమూర్తమైనది. 5.వాస్తవ దూరమైన పరిస్తితుల ఆధారంగా రూపోందిండం. అగమన పధ్దతి-Inductive Method: అగమన పధ్దతి- Inductive Method జర్మనీకి చెందిన చారిత్రక వాదులైన రోచర్ ( Roscher ) హిల్ బ్రాండ్( Hillbrand ), ఫెడ్రిక్ లిస్ట్ ( Federic List ) ఈ పధ్దతిని ఆచరించిన ప్రముఖులు దీనిని అనుభవ ప్రధాన పధ్ధతని ( Emperical Method) లేదా చారిత్రక పధ్ధతని (Historical Method) అంటారు . దీని ప్రకారం ఆయా దేశాల పరిస్థితులను పరిశీలించి వాటి తాలూకు గణాంకాలను సేకరించి వాటిని విశ్లేషించి, భవిష్యత్తు తీరుతెన్నులను వివరిండం జరుగుతుంది వర్తమాన యుగాన్ని ఆగమన యుగం గా పేర్కొన్నారు. ఉదా-మాల్థస్ జనాభా సిధ్దాతం, ఏంజెల్ వినియోగ సూత్రాలు. అగమన పధ్దతి-సుగుణాలు-లోపాలు: అగమన పధ్దతి-సుగుణాలు-లోపాలు సుగుణాలు-1.వాస్తవ అంశాల ఆధారంగా సిధ్దాంతాలు. 2. గణాంకాలు వుపయోగంచడం వలన విశ్లేషణకు వుపయోగం. 3. సామాన్య విషయాలనుండి ప్రత్యేక విషయాలు తెలుసుకొనడం. లోపాలు- 1.సేకరించిన విషయాలు సక్రమంగా లేకపోతే సిధ్దాంతాలు సక్రమంగా వుండవు. 2. గణాంకాలు కేవలం సంభావ్య పరిస్థితిని మాత్రమే తెలియజేస్తాయి.3 విషయ సేకరణ, విశ్లేషణ నిర్ణయాల ప్రతిపాదనలు వ్యయప్రయాసాలతో కూడుకున్నది. పాక్షిక సమతౌల్యం-సమగ్ర సమతౌల్యం: పాక్షిక సమతౌల్యం-సమగ్ర సమతౌల్యం సమతౌల్యం అనేది ఒక విరామ స్థితిని సూచిస్తుంది. రెండు విరుధ్ద శక్తులు సమానమైనప్పుడు వాటి మధ్య సమతౌల్యం ఏర్పడుంతుంది. ఆర్థిక వ్యవస్థలో అనేక అంశాలున్నప్పటికి ఏ రెండింటినో పరిగణలోనికి తీసుకొని వాటి మధ్య వున్న కార్యకారణ పరిశీలించడం జరిగితే దానిని పాక్షిక సమతౌల్యం అంటారు. ఉదా-డిమాండు సూత్రం, సప్లయ్ సూత్రం. కీటక దృష్టి.దీనికి మార్షల్ ప్రాధాన్యతనిచ్చినాడు సమగ్ర సమతౌల్యం: సమగ్ర సమతౌల్యం ఫ్రాన్స్ దేశానికి చెందిన వాల్రస్ సమగ్ర సమతౌల్యానికి ప్రాధాన్యత. జె.ఆర్. హిక్స్, శామూల్‌సన్ దీనిని అభివృధ్ధి పర్చినారు. అన్ని చలాంకాలను పరిగణలోనికి తీసుకొని వాటి మధ్య కార్య కారణ సంబంధాన్ని వివరించడం. స్టిగ్లర్ ప్రకారం ఆర్థిక వ్యవస్థలోని అన్ని విభాగాల మధ్య పరస్పర సంబంధాల పరిశీలన. విహంగ దృష్టి. ఆధునిక ద్రవ్య సిధ్ధాంతం సంక్షేమ అర్థశాస్త్రం అధ్యయనానికి దోహదం. నిశ్చిత శాస్త్రం (Positive Science) నిర్ణయ శాస్త్రం (Normative Science): నిశ్చిత శాస్త్రం (Positive Science) నిర్ణయ శాస్త్రం (Normative Science) శాస్త్రాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చును 1.నిశ్చిత శాస్త్రం 2.నిర్ణయ శాస్త్రం. నిశ్చిత శాస్త్రం -ఒక విషయం వున్నతీరును విశ్లేషిస్తుంది. నిర్ణయ శాస్త్రం -వున్నతీరు మంచిదా లేదా చెడ్డదా వుండవలిసిన తీరేమిటి అనే విషయాన్ని పరిశీలిస్తుంది. Positive Science explains what it is and Normative science tells what ought to be. ప్రకృతి శాస్త్రాలు నిశ్చిత శాస్త్రాలు ఇవి స్వతంత్రంగా ప్రవర్తిస్తాయి. రాబిన్స్ నిర్వచనం అర్థశాస్త్రాన్ని శుధ్ధ శాస్త్రంగా మార్చినప్పటికి ఇది సంక్షేమానికి దోహద పడాలి. పిగూ ప్రకారం అర్థశాస్త్రం దీప్తిమంతమే గాక ఫల ప్రదంగా వుండాలి. Economics  can be both ‘ light - giving ’ and ‘ fruit -bearing’. ఆర్థిక సూత్రాల స్వభావం: ఆర్థిక సూత్రాల స్వభావం ఆర్థిక సూత్రాలు మానవ సంబంధమైనవి. దీని సూత్రాలు సంఘటన దోరణులను మాత్రమే తెలియజేస్తాయి. ప్రమేయాలపై ఆధారపడి వుంటాయి. దీనికి సమాజమే ప్రయోగశాల. మార్షల్ ఆర్థిక సూత్రాలను సముద్ర అలల ఆటుపోటులతో పోల్చినాడు.

Add a comment

Related presentations